దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 8 : గురుకుల విద్యాలయాల పరిశుభ్రతే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండలోని గిరిజన మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో స్వచ్ఛ గురుకులం పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో శిరందాసు కృష్ణయ్య, హన్మంతువెంకటేశ్గౌడ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, ప్రిన్సిపాల్ శ్యామల, శ్రీరాం, ప్రసన్న, సరిత పాల్గొన్నారు.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం
దేవరకొండ : ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం స్ధానిక స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో ఫిజియోథెరపీ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వైద్యుడు జంపాల సునీల్‌ను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, రైతు బంధు సమితీ మండలాధ్యక్షడు శిరందాసు కృష్ణయ్య, వైస్ చైర్మన్ రహత్‌అలీ, కౌన్సిలర్లు వడ్త్య దేవేందర్‌నాయక్, మూఢావత్ జయప్రకాశ్‌నారాయణ, తాళ్ల శ్రీధర్‌గౌడ్, కృష్ణ కిశోర్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, ఉమా మహేశ్, భాస్కర్‌రెడ్డి, తాళ్ల సురేశ్ పాల్గొన్నారు.
వినాయకుడికి పూజలు
దేవరకొండలోని 11, 12వ వార్డుల్లో గణనాథుల వద్ద ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గురువారం పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించారు.