సూర్యాపేటటౌన్, సెప్టెంబర్ 7 : పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 335 మంది లబ్ధ్దిదారులకు రూ.1.45 కోటి సీఎం సహాయ నిధి చెక్కులను సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుధవారం మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయం నిధి వరంగా మారిందన్నారు. నిరుపేదలకు కార్పొరేటు వైద్యం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పార్టీలతో సంబంధ లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి వర్తిస్తుందన్నారు. పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు తోడుగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీలు నెమ్మాది భిక్షం, మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, బీరవోలు రవీందర్‌రెడ్డి, కుమారీబాబు, జడ్పీటీసీలు మామిడి అనితాఅంజయ్య, జీడి భిక్షం పాల్గొన్నారు.