మిర్యాలగూడ రూరల్, సెప్టెంబర్ 6 : ఓటరు కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిషత్ సమావేశం మందిరంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. దాంతో పాటు ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సవరించేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు. 18 సంత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ టి. వీరారెడ్డి, ఎన్నికల డిప్యూటీ తాసీల్దార్ కల్పన పాల్గొన్నారు.
అవగాహన కల్పించాలి : ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి
పెద్దఅడిశర్లపల్లి : వయోజనులందరూ తమ ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ రామాంజనేయులు, ఎంపీడీఓ బాలరాజు పాల్గొన్నారు.
అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలి : ఆర్డీఓ
దేవరకొండ : 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఆర్డీఓ గోపీరాం అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో బీఎల్ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, తాసీల్దార్ రాజు, ఎన్నికల డిప్యూటీ తాసీల్దార్ ముబీన్, వెంకటయ్య, బీఎల్ఓలు, మెప్మా ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.