చండూరు, సెప్టెంబర్ 6 : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు మంగళవారం నిర్వహించారు. పలు విగ్రహాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చండూరు మండల కేంద్రంలో పలు మండపాలను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. అంబేద్కర్ కాలనీలో మాజీ జడ్పీటీసీ అన్నెపర్తి సంతోషాశేఖర్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుర్రం మాధవీవెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భూతరాజు దశరథ, కౌన్సిలర్ కోడి వెంకన్న, కొన్రెడ్డి యాదయ్య, చిలుకూరి రాధికా శ్రీనివాస్, భీమనపల్లి శేఖర్, పున్న ధర్మేందర్, మొగుదాల వెంకన్న, తేలుకుంట్ల చంద్రశేఖర్, సంగెపు శ్రీనివాస్, తాందారి రవి, పున్న సైదులు, దోటి చంద్రశేఖర్, జొర్రీగల వెంకన్న పాల్గొన్నారు.
మిర్యాలగూడ 25 వార్డులో పూజలు
మిర్యాలగూడ : పట్టణంలోని 25వ వార్డులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధ్దార్థ, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వంగాల నిరంజన్‌రెడ్డి, స్వర్ణలత, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యర్శి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బాసాని గిరి, అశోక్, వెంకన్న, సైదులు, నాగరాజు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో అన్నదానం
శాలిగౌరారం: రామగిరి గ్రామంలో నెలకొల్పిన గణేశ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చాడ హతీశ్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారు శంకరయ్యగౌడ్, అన్నదాత నిమ్మల ఆండాలు, నర్సయ్య పాల్గొన్నారు.
కనగల్ : మండలంలోని బోయినపల్లిలో గణేశ్ విగ్రహం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన గానుంతల అనంతరెడ్డి, రాములమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు రాంరెడ్డి, పెద్దిరెడ్డి, లక్ష్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి అన్నదానం చేశారు.
రామగిరి : నల్లగొండ పాతబస్తీ హనుమాన్‌నగర్‌లోని 1వ నంబర్, బోయవాడ, పలు ప్రాంతాల్లో గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు. అన్నదానాలు ప్రారంభించారు. కార్యక్రమంలో నల్లగొండ గణపతి ఉత్సవ కమిటీఅధ్యక్షడు నేతి రఘుపతి పాల్గొన్నారు.
శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి
మర్రిగూడ : గణేశ్ శోభాయాత్రను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రశాంతంగా జరుపుకోవాలని జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి సూచించారు. మండలంలోని సాయిబండా తండాలో గణేశ్ శోభాయాత్రలో పాల్గొని యువకుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంబోతు సుధాకర్ నాయక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గణేశ్ శోభయాత్రకు ఏర్పాట్లు
దేవరకొండ : ఈ నెల 9న దేవరకొండ పట్టణంలో నిర్వహించే వినాయక నిమజ్జన శోభాయాత్రకు ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ సమీపంలోని పర్వతాల చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించిన అధికారులు చెరువుకు వెళ్లే దారిలో ఉన్న కంపచెట్లను తొలగించి రోడ్డును చదును చేస్తున్నారు. పనులను వినాయక ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు నక్క వెంకటేశ్‌యాదవ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నీల రవికుమార్, జింకల లింగయ్య, నేతాళ్ల వెంకటేశ్‌యాదవ్ పర్యవేక్షించారు.
గణేశ్ ఉత్సవ కమిటీలకు విరాళం
మునుగోడు: మండలంలోని మంగళదొడ్లగూడెం, సింగారం, కచలాపురం గ్రామాల్లో సుమా రు 40 గణేశ్ ఉత్సవ కమిటీలకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రూ.10 వేల చొప్పున విరాళం అందించగా ఎంపీపీ కర్నాటి స్వామి మంగళవారం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నిండు హృదయంతో గణేశ్ ఉత్సవ కమిటీలకు విరాళాలు ఇచ్చారని కొనియాడారు.
విద్యార్థులకు పోటీలు
రామగిరి : గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని వీటీకాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద విద్యార్థులు పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. వీటిలో పర్యావరణ, ఇతర అంశాల్లో డ్రాయింగ్, మెమొరీ టెస్టు, జనరల్ నాలెడ్జ్ పోటీలు నిర్వహించారు. పరిసర కాలనీ విద్యార్థులు ఉత్సహంగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బహుమతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.