సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 2 : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, వడ్డెర, యాదవ సంఘం నాయకులు 250మంది, కొత్తగూడెం గ్రామానికి చెందిన 50కుటుంబాలు వారి సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నాయకులకు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారన్నారు. రానున్న మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. అనంతరం చిమిర్యాల గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచులు దోనూరి జైపాల్‌రెడ్డి, దోనూరి సుశీల, ఎంపీటీసీ దోనూరి శ్రావణి, వార్డు మెంబర్ సత్తమ్మ, కోఆప్షన్ మెంబర్ సురుకంటి రంగారెడ్డి, నాయకులు దోనూరి శేఖర్‌రెడ్డి, మల్లేపల్లి కృష్ణారెడ్డి, నరేశ్, రాజు, గోపాల్, రమేశ్, సాలయ్య, భిక్షపతి, జంగారెడ్డి, రాజు పాల్గొన్నారు.