నందికొండ, సెప్టెంబర్ 2 : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి 1,70,620 ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్ల ద్వారా 1,27,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590(312 టీఎంసీ) అడుగులకు 589. 00 (309.0570 టీఎంసీ) అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడికాల్వ ద్వారా 8,375 క్యూసెక్కులు, ఎడుమ కాల్వ ద్వారా 6,556 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,414 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నది. ఎల్ఎల్బీసీ ద్వారా నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 1,77,665 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు 884.60 ( 213.4011 టీఎంసీ) మేర నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 1,26,238 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది.