నీలగిరి, సెప్టెంబర్ 1 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలో కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను గురువారం లక్ష్మీగార్డెన్‌లో 13,14,15,16,17 స్టార్ ఫంక్షన్ హాల్లో 12,26,27,28,29 అమృత గార్డెన్స్‌లో 1,2,18,19 వార్డులకు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ దేశ ప్రజలు తెలంగాణ వైపు చూస్తుంటే అది గిట్టని మోదీ సర్కారు తెలంగాణ అభివృద్ధ్దిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నదని విమ ర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలను ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కౌన్సిలర్లు జెర్రిపోతుల ఆశ్వినీభాస్కర్, ఉట్కూరి వెంకట్‌రెడ్డి, వట్టిపల్లి శ్రీనివాస్, అలకుంట్ల రాజేశ్వరి మోహన్‌బాబు, ఎడ్ల శ్రీనివాస్, బోయినపల్లి శ్రీనివాసులు, మహ్మద్ సమియోద్దీన్, టీఆర్ఎస్ నాయకులు 19వార్డు ఇన్చార్జి సందినేని జనార్దన్‌రావు, రావుల శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
ఎల్ఓసీ అందజేత
నల్లగొండ రూరల్ : మండలంలోని పెద్ద సూరారం గ్రామానికి చెందిన బండారి వేణు, కల్పన దంపతుల కుమార్తె కీర్తన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నిమ్స్ చికిత్స పొందుతున్నది. ఆమె వైద్యం కోసం మంజూరైన రూ.2 లక్షల ఎల్ఓసీని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బుధవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కోట్ల రమాదేవీజయపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, నాయ కులు బకరం వెంకన్న పాల్గొన్నారు.
దాసయ్యకు నివాళి
నీలగిరి : నల్లగొండ పట్టణంలోని 8వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు బళ్ల దాసయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అయన మృతదేహానికి ఎమ్మెల్యే కంచర్లభూపాల్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కౌన్సిలర్లు మారగోని గణేశ్, ప్రదీప్‌నాయక్, బోయినపల్లి శ్రీనివాసులు, మహ్మద్ సమియోద్దీన్, టీఆర్ఎస్ నాయకులు కన్నెబోయిన అంజిబాబు, మన్నెం రాములు, ఆర్.కిరణ్, కొండ కిరణ్, దాసరి శౌరిరాజు, ఫాదర్ జోసెఫ్ ,ఫాదర్ దాసయ్య పాల్గొన్నారు.