రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఉమ్మడి జిల్లా నుంచి 9మంది టీచర్లు ఎంపికయ్యారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో సూర్యాపేట జిల్లా నుంచి నలుగురు, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఇద్దరు, నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. 5 కేటగిరీల్లో ఎంపిక జరిగింది. ఆయా ఉపాధ్యాయులు ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో అవార్డులు అందుకోనున్నారు.
సూర్యాపేట అర్బన్, సెప్టెంబర్ 1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్ధాయి ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 9 మంది ఉపాధ్యాయులకు చోటు దక్కింది. గురువారం ప్రకటించిన రాష్ట్రస్థాయి అవార్డుల్లో 5 కేటగిరిల్లో ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వివిధ కేటగిరిలో ఎంపికైన వారిలో సూర్యాపేట జిల్లా నుంచి నలుగురు, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఇద్దరు, నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు. వీరికి ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున అవార్డులు అందించనున్నారు.
ఎ.వెంకన్న -స్కూల్ అసిస్టెంట్, జడ్పీహెచ్ఎస్ -2, సూర్యాపేట
కె.రామారావు-స్కూల్ అసిస్టెంట్, జడ్పీహెచ్ఎస్, చిలుకూరు మండలం
టి.సత్యనారాయణరెడ్డి-ఎస్జీటీ, ఎంపీపీఎస్, నర్సింహాపురం, మోతె మండలం
ఎం.వెంకటయ్య -ఎస్జీటీ, ఎంపీయూపీఎస్, పొట్లపహాడ్, పెన్‌పహాడ్ మండలం
ఎస్.సతీశ్‌కుమార్ – మాథ్స్టీచర్, సర్వేల్ గురుకులం, సంస్థాన్‌నారాయణపురం మండలం
సీహెచ్.భరణీకుమార్ -స్కూల్ అసిస్టెంట్, జడ్పీహెచ్ఎస్, అడ్డగూడూర్ మండలం
కె.రాజవర్ధన్‌రెడ్డి-స్కూల్ అసిస్టెంట్ జడ్పీహెచ్ఎస్, బ్రాహ్మణవెల్లంల, నార్కట్‌పల్లి మండలం
యు.లచ్చిరామ్‌నాయక్ -ఎస్జీటీ, ఎంపీయూపీఎస్, తెరట్పల్లి,చండూరు మండలం
కడారి అనిత-ఎస్జీటీ, ఎంపీపీఎస్, చందుపట్ల, నకిరేకల్ మండలం