అన్ని గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నోటిఫికేషన్లు ఇచ్చిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతానని పేర్కొన్నారు. చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర ప్రజాత్రినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లికార్జున్‌రెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మతోపాటు అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షుడు ఎస్.వేణుగోపాలచార్యులు, సీనియర్ అసిస్టెంట్ నర్సింహ, అసిస్టెంట్ లైబ్రేరియన్ నాగయ్య, శ్రవణ్‌కుమార్, నిర్మాలాదేవి, శారద, మల్లేశ్ పాల్గొన్నారు.