మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం మర్రిగూడ మండలం కొండూరు గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అదే మండలం ఖుదాభక్ష్‌పల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. అలాగే సంస్థాన్‌నారాయణపురం మండలం గంగమూలతండా, కడిలబావితండా గ్రామాలకు చెందిన 80 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
సూర్యాపేట, ఆగస్టు 29 : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి, సమయానుకూలంగా ప్రయాణాలు జరిగేలా తెలంగాణ ఆర్టీసీ యజమాన్యం నూతన ఒరవడికి నాంది పలుకుతున్నది. ఇప్పటికే ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా సమయానికి బస్సులు వచ్చేలా చూస్తున్న ఆర్టీసీ ఇంకా మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించింది. ప్రయాణికులు సమాయాన్ని వృథా చేసుకోకుండా తన సెల్ఫోన్లో ఉన్న యాప్ ద్వారా ప్రయాణించే రూట్లో ఎన్ని బస్సులు వస్తున్నాయని, ప్రస్తుతం బస్సు ఎక్కడ ఉంది, ఎక్కాల్సిన స్టాప్ వద్దకు ఏ సమయానికి వస్తుందని తెలుసుకునేందుకు జీపీఎస్ సిస్టమ్ తీసుకువస్తున్నది. ప్రతి బస్సుకూ జీపీఎస్ ద్వారా వెహికిల్ ట్రాకింగ్ సిస్టం అమర్చనున్నారు.
ఈ ప్రక్రియ ఇప్పుటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదలైంది. ఉమ్మడి జిల్లా రీజినల్ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, దేవరకొండ, నార్కట్‌పల్లి, మిర్యాలగూడెం, కోదాడ, యాదగిరిగుట్ట డిపోలు ఉన్నాయి. ఆయా డిపోలో పరిధిలో 673 బస్సులు ఉండగా, 5 రాజధాని, 45 సూపర్ లగ్జరీ, 58 డీలక్స్, 140 ఎక్స్‌ప్రెస్, 378 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్రకు జిల్లా నుంచి బస్సు సర్వీసులు ఉం డగా అంతర్జిల్లాలు, జిల్లా పరిధిలోని మండలాలను టచ్ చేస్తూ అనేక రూట్లు ఉన్నాయి.
రోజూ దాదాపు 2.60 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తుంటాయి. దాదాపు 1.80 లక్షల మంది ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. అనేక మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు హైదరాబాద్ నగరాలతోపాటు విజయవాడ, గుంటూరు, వరంగల్ ప్రయాణం చేస్తుంటారు. గ్రామాల్లో సైతం చాలామంది ఇప్పటికీ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. తొలుత రాజధాని వంటి అంతర్జిల్లా వాహనాలకు జీపీఎస్ అమర్చి ఆ తరువాత దశల వారీగా పల్లెవెలుగు వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దసరా నాటికి అన్ని బస్సులకు అమర్చి ప్రజలకు ప్రత్యేక యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. యాప్ తయారు చేసే పనిలో ఆర్టీసీ యంత్రాంగం నిమగ్నమయ్యారు.
నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించే పని చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కార్గోను ప్రవేశపెట్టి రవాణాను ఆర్టీసీ ద్వారా చేపట్టి అనేక లాభాలను తీసుకొచ్చారు. అదేవిధంగా జీపీఎస్‌లను బస్సులకు అమర్చి బస్సుల వివరాలు క్షణక్షణం తెలుసుకునే విధంగా యాప్ రూపొందిస్తున్నారు. దీంతో ప్రయాణికులను ఆకర్షించడంలో ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. బస్సు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమయానికి బస్టాండ్‌కు చేరుకోవడం జరుగుతున్నది. ప్రయాణికులు బస్మిస్ కాకుండా ముందుగా చేరుకుంటారు.