రామగిరి, ఆగస్టు 29 : పర్యావరణ పరిరక్షణకు ప్రజలు మట్టి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి సూచించారు. పర్యావరణ పరిరక్షణకు వైఆర్పీ ఫౌండేషన్- ‘నమస్తే తెలంగాణ’ సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన ‘మట్టి గణపతి విగ్రహాల’ పంపిణీకి ప్రజలను నుంచి విశేష స్పందన లభించింది. క్లాక్‌టవర్ సెంటర్లో చేపట్టిన కార్యక్రమానికి కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యలిశాల రవిప్రసాద్‌తో కలిసి విగ్రహాలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాలకు రంగు రంగుల విగ్రహాలు వినియోగంతో పర్యావరణం దెబ్బతినడంతో పాటు జలం, అందులోని జీవరాశులు నశిస్తున్నాయన్నారు.
కావున ప్రతిఒక్కరూ మట్టితో చేసిన విగ్రహాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సమాజ సేవలో భాగంగా ‘నమస్తే తెలంగాణ’, వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి మహత్తర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఆర్పీ ఫౌండేషన్ సేవలు విస్తరించేలా ఏర్పాటు చేసిన ‘వైఆర్పీ ఫౌండేషన్’ వెబ్‌సైట్‌ను ఫౌండేషన్ చైర్మన్ యలిశాల రవిప్రసాద్‌తో కలిసి కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేంద్రచారి, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్‌రెడ్డి, ఏడీవీటీ ఇన్చార్జి కైరంకొండ శివకుమార్, కౌన్సిలర్ యామ కవిత, వైఆర్పీ ఫౌండేషన్ ఆర్గనైజర్, టీఆర్ఎస్ నాయకుడు యామ దయాకర్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, అర్రూరి సత్యనారాయణ, శివకోటి నెహ్రూ, నూనె కిశోర్, కక్కిరేణి లక్ష్మీనారాయణ, కాసం శేఖర్, తల్లం గిరీశ్‌కుమార్, మంచుకొండ శంకర్, నమస్తే తెలంగాణ రిపోర్టర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
‘మట్టి గణపతిని పూజిద్దాం- పర్యావరణాన్ని పరిక్షిద్దాం’ అనే నినాదంతో ‘నమస్తే తెలంగాణ’, వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాకేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల వైఆర్పీ ఆఫీసు, గడియారం సెంటర్, శివాజీనగర్‌లోని టీటీడీ కల్యాణ మండపం, పానగల్ ఫ్లైఓవర్, వీటీకాలనీలోని వేంకటేశ్వరస్వామి టెంపుల్, మిర్యాలగూడ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి టెంపుల్ వద్ద విగ్రహాలు పంపిణీ చేశారు. 12వేలకు పైగా విగ్రహాలు పంపిణీ చేశారు. మంగళవారం సైతం ఆయా సెంటర్లలో విగ్రహాలు పంపిణీ
ఆరేండ్లుగా వినాయక చవితికి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యలిశాల రవిప్రసాద్ తెలిపారు. పేద విద్యార్థులకు విద్య, స్కిల్ ఓరియంటేషన్ శిక్షణతో పాటు సామాజిక సేవే లక్ష్యంగా వైఆర్పీ ఫౌండేషన్ పని చేస్తున్నదన్నారు. ప్రతి యేడాది ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్, పరీక్ష సామగ్రి అందిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు సాయం అందించడం, వయోవృద్ధుల సంక్షేమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఆర్పీ ఫౌండేషన్ సేవలకు వెబ్సైట్ ప్రారంభించామని ఎవరైనా సాయం కావాలంటే వెబ్సైట్లో సంప్రదించవచ్చని సూచించారు.