బొమ్మలరామారం, ఆగస్టు 29 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ భరోసా ఇస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. మండలంలోని రంగాపూర్ గ్రామంలో గల ఓంశివ ఫంక్షన్ హాల్లో సోమవారం వారు లబ్ధిదారులకు మంజూరైన 983ఆసరా ఫించన్కార్డులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆసరా పింఛన్ అర్హత వయసును తగ్గించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందని కుటుంబాలు లేవన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుశంగల సత్యనారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఏనుగు కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్, ఎంపీడీఓ సరిత, టీఆర్ఎస్ మండల నాయకులు మచ్చ శ్రీనివాస్‌గౌడ్, గుర్రాల లక్ష్మారెడ్డి, గొడుగు చంద్రమౌళి, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తుర్కపల్లి : అర్హులందరికీ ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్ హాల్లో సోమవారం ఆమె వివిధ గ్రామాలకు చెందిన 1164మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి పైరవీలు, లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయన్నారు.
కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దునాయక్, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్, తాసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు పలుగుల నవీన్‌కుమార్, గిద్దె కర్ణాకర్, కోమటిరెడ్డి సంతోషభాస్కర్రెడ్డి, మోహన్‌బాబు, ప్రతిభ, శ్రీనివాస్, కోఆప్షన్ రహమత్‌షరీఫ్, సర్పంచులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.