యాదాద్రి, ఆగస్టు 29 : పేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరుకు చెందిన మచ్చ మణెమ్మకు రూ.24,500, మచ్చ శ్రీనివాస్‌కు రూ.42,500 సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరయ్యాయి. సంబంధిత చెక్కులను సోమవారం పట్టణంలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, యాదగిరిగుట్ట, ఆలేరు పీఏసీఎస్ చైర్మన్లు ఇమ్మడి రామచంద్రారెడ్డి, మొగులగాని మల్లేశ్‌గౌడ్, రైతుబంధు సమితి కన్వీనర్ మిట్ట వెంకటయ్య పాల్గొన్నారు.
మోటకొండూరు : సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని మంత్రి హారీశ్‌రావు యువసేన జిల్లా అధ్యక్షుడు శవ్వ నవీన్‌కుమార్ అన్నారు. మండలంలోని చాడ గ్రామానికి చెందిన చందుపట్ల లక్ష్మికి సీఎం సహాయ నిధి నుంచి రూ.37,500 చెక్కు మంజూరు కాగా సోమవారం లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ నాయకులతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్గ ఎట్టమ్మ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పబ్బతి శ్రీధర్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ మహమూద్, వార్డు సభ్యుడు గుర్రాల నర్సింహ, నాయకులు మల్గ సిద్ధులు, నరేశ్‌గౌడ్, చంద్రయ్య, సుదర్శన్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రానికి చెందిన బైరబోయిన శోభకు రూ.60 వేలు, గవ్వల మల్లేశానికి రూ.45 వేలు, రాచమల్ల రవికుమార్‌కు రూ.22,500, పెంట అనసూయకు రూ.19వేలు , రాగటి ఆదినారాయణగౌడ్కు రూ.29వేలు, గాజుల వెంకటేశ్‌కు రూ.60వేలు, ఇంజ ప్రశాంత్‌కు రూ.30 వేలు సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఆ చెక్కులను టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్ భిక్షపతి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, మహిళా, బీసీ, మైనార్టీ విభాగాల అధ్యక్షులు అరుణ, వెంకటేశ్వర్లు, అజీమొద్దీన్, సోషల్ మీడియా కన్వీనర్ విజయ్ పాల్గొన్నారు.
రాజాపేట : మండలంలోని పుట్టెగూడెంలో మాలోతు రాముకు రూ.24,500, భూక్యా అమృతకు రూ.15 వేల చెక్కులు సీఎం సహాయ నిధి నుంచి మంజూరవగా, వాటిని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మాడోతు దేవీరాములునాయక్, లక్ష్మణ్‌నాయక్, సిద్ధూ, సురేశ్, శంకర్, ఆంజనేయులు పాల్గొన్నారు.