భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 29 : మండలంలోని తుక్కాపురం గ్రామంలో సోమవారం బుగ్గపోచమ్మ-గణపతిరాజుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ వేర్వేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు.
కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్రావు, అతికం లక్ష్మీనారాయణగౌడ్, నరాల వెంకటస్వామి, పుట్ట వీరేశ్‌యాదవ్, నోముల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు రాసాల మల్లేశ్‌యాదవ్, కొండల్‌రెడ్డి, సర్పంచులు అంకర్ల మురళి, మాకోలు సతీశ్, చిందం మల్లికార్జున్, చిన్నం పాండు, ఈర్ల కృష్ణ, కౌన్సిలర్ అజీమ్, నాయకులు రాసాల శేఖర్, రాసాల కుమార్, కంకల కృష్ణ, నల్లమాసు సత్యనారాయణగౌడ్, ముంతు సతీశ్, వల్లపు పర్వతాలు, ఉప్పలయ్య, జనగాం మహేశ్, బాత్క అశోక్, పాశం మహేశ్, కాసాని వెంకటేశ్ పాల్గొన్నారు.