వలిగొండ, ఆగస్టు 27 : రాష్ట్రంలోని వృద్ధుల ఆర్థిక ఇక్కట్లను తీర్చేందుకు సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆసరా పింఛన్ భరోసా కలిగిస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో కొత్త ఆసరా పింఛన్ కార్డుల పంపిణీలో వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆసరా పింఛన్లతోపాటు రైతులకు రైతుబీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గొల్లకుర్మలకు గొర్లపంపిణీ, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ, దళితులకు దళిత బంధు వంటి పథకాలు అమలు చేస్తూ వారి అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో ఎక్కడా కరువు పరిస్థితులు రాలేదని, ముఖ్యమంత్రి కృషితో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు దర్శనం ఇస్తున్నాయని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ లక్షల కోట్ల సంద సృష్టించి సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేటాయిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మందడి ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ నూతి రమేశ్‌రాజ్, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమాబాలనర్సింహ, సర్పంచ్ బోళ్ల లలిత, ఎంపీటీసీలు పల్సం రమేశ్, యశోద, భాగ్యమ్మ, ఆరూరు పీఏసీఎస్ చైర్మన్ చిట్టెడి వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి, ఎంపీడీఓ గీతారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.