నూతనకల్, ఆగస్టు 23 : సీఎం కేసీఆర్ అభివృద్ధి పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చూడి రాఘవరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, వీరబోయిన కొమురయ్య, జటంగి అంజయ్య, వెంకన్న, నాగిరెడ్డితోపాటు మరో 10 మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వివక్ష చూపని అభివృద్ధి పాలన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని యావత్ ప్రజానీకం నమ్ముతుందని, అందుకే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి. టీఆర్ఎస్ జిల్లా నాయకుడు భూరెడ్డి సంజీవరెడ్డి, మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, సర్పంచ్ చూడి లింగారెడ్డి, బత్తుల సాయిల్‌గౌడ్, పన్నాల సైదిరెడ్డి, తాడూరి లింగయ్య, సురేందర్‌నాయక్, నర్సింగ్‌నాయక్, గంగయ్య పాల్గొన్నారు.