దేవరకొండ, ఆగస్టు 22 : బాసర ట్రిపుల్ ఐటీలో దేవరకొండకు చెందిన విద్యార్థిని చెన్నబత్తిని అనూష సీటు సాధించింది. స్థానిక జడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి చదివిన అనూష 9.8 జీపీఏతో ఉత్తీర్ణత సాధించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో బీసీ ఏ కేటగిరీలో ఆమెకు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినట్లు పాఠశాల హెచ్ఎం రెబాక తెలిపారు. విద్యార్థిని పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ ఇంజినీర్ కావాలనేదే తన జీవితాశయమన్నారు.
రావులపెంట జడ్పీహెచ్ఎస్ విద్యార్థికి..
వేములపల్లి : మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఉత్తెర్ల గోపి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. విద్యార్థిని స్కూల్ హెచ్ఎం మంగళ, ఉపాధ్యాయులు సోమవారం సన్మానించారు.
మోడల్ స్కూల్ విద్యార్థులకు
నాంపల్లి : మండలంలోని పెద్దాపురంలో గల మోడల్ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించినట్లు ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. పాఠశాలలో 10వ తరగతి చదివిన వడ్డపల్లి గ్రామానికి చెందిన ధర్మరపు సుష్మిత, మల్లపురాజులపల్లి గ్రామానికి చెందిన బోదాసు అర్జున్, నాంపల్లికి చెందిన బెల్లి తారణి సీట్లు సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
సీటు సాధించిన వెన్నల
చిట్యాల : మండలంలోని గుండ్రాంపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన బొబ్బలి వెన్నెలకు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు లభించింది. విద్యార్థినిని ప్రధానోపాధ్యాయుడు నర్సింగ్‌రావు, ఉపాధ్యాయులు అభినందించారు.
నిడమనూరు నుంచి
నిడమనూరు : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠ శాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రంజిత ఒక సోమవారం ఒక ప్రకట నలో తెలిపారు. పాఠశాలకు చెందిన ఉన్నం వెంకట్, సామా మైథిలి, దారం అక్షిత మొదటి ఫేజ్‌లోనే సీట్లు సాధించినట్లు పేర్కొన్నారు. సీట్లు సాధించిన విద్యార్థులను సోమవారం ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
విద్యార్థికి సన్మానం
దామరచర్ల : మండలంలోని కొండ్రపోల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన రాచూరి మణికుమార్‌కు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు లభించింది. సోమవారం పాఠశాల హెచ్ఎం భీమ్లానాయక్, ఉపాధ్యాయులు విద్యార్థికి స్వీట్లు తినిపించి అభినందించారు. ఇంజినీర్ కావాల న్నదే తన లక్ష్యమని మణికుమార్ తెలిపాడు.