నల్లగొండ, ఆగస్టు 2 : ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేనేత బీమా కల్పించనుండడంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మానగర్‌లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా చేనేత కార్మికులు మాట్లాడుతూ సమైక్య పాలనలో చేనేత కార్మికులు ఆకలి చావులతో అల్లాడారని, సీఎం కేసీఆర్ జోలెపట్టి వసూలు చేసి పోచంపల్లి కార్మికులను ఆదుకున్న గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర, చేనేత త్రిఫ్ట్, కరెంట్ సబ్సిడీ, రుణ మాఫీ, బతుకమ్మ చీరెల తయారీ ద్వారా ఆర్థికంగా చేయూతనిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు కర్నాటి యాదగిరి, చెరిపల్లి శ్రీనివాస్, రఘురాం, చంద్రశేఖర్, జయ ప్రకాశ్, రాజేందర్, యాదయ్య, మిర్యాల వెంకన్న, లక్ష్మీనారాయణ, వేణు, రమేశ్ పాల్గొన్నారు.