నాంపల్లి, ఆగస్టు 2 : మండలాభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని టీఆర్ఎస్ మండల నాయకులు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాందాస్‌తండా, ముష్టిపల్లికి 33కేవీ సబ్స్టేషన్లు మంజూరైనా స్థల సేకరణ జాప్యంతో నిర్మాణ పనులు చేపట్టలేదని మంత్రికి వివరించారు. వెంటనే నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాంపల్లి నుంచి చింతపల్లి మార్గంలో తుంగపహాడ్ వద్ద పుల్సు వాగుపై బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు.
సాగర్ హైవే నుంచి దేవత్‌పల్లి, శర్భణాపురం మీదుగా వెంకటంపేట వరకు, బండతిమ్మాపురం గేట్ నుంచి బండతిమ్మాపురం మీదుగా పాటిమీదిగూడెం వరకు, తుమ్మపల్లి నుంచి మేళ్లవాయి వరకు, గట్ల మల్లేపల్లి నుంచి తుమ్మపల్లి వరకు బీటీ రోడ్ల నిర్మాణం చేయించాలని కోరారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. నాంపల్లి మండలాభివృద్ధికి సహకరిస్తానని, సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని, రోడ్ల నిర్మాణానికి నిధులిస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, అధికార ప్రతినిధి పోగుల వెంకట్‌రెడ్డి, మాల్ మార్కెట్ డైరెక్టర్లు శ్రీశైలం యాదవ్, యాదయ్య, సర్దార్‌నాయక్, ప్రచార కార్యదర్శి కొన్రెడ్డి ఏడుకొండల్, సర్పంచులు శ్రీలత, అంజయ్య, రవినాయక్, సైదులు, చందూలాల్ ఉన్నారు.