నకిరేకల్, ఆగస్టు 2 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి తెలిపారు. పెండింగ్, నూతనంగా చేపట్టనున్న పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎంకు విన్నవించినట్లు చెప్పారు.