దేవరకొండ, జూలై 23 : పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తేవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని 11వ వార్డులో రూ. 50లక్షలతో నిర్మించ నున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని వార్డుల్లో నాలాల పరిశుభ్రత, విద్యుత్ వైర్ల మరమ్మ తులు, అక్రమ నిర్మాణాలు, పిచ్చి మొక్కల తొలగింపు పనులు చేపట్టినట్లు చెప్పారు. గజ్వేల్ తరహాలో దేవరకొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, కమిషనర్ వెంకటయ్య, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, వైస్ చైర్మన్ రహత్‌అలీ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఏస్ రాష్ట్రనాయకుడు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ వ్యడ్తా దేవేందర్‌నాయక్, జడ్పీటీసీ అరుణాసురేశ్గౌడ్, కౌన్సిలర్ తస్కీన్సుల్తానా, ఇలియాస్, సత్తార్, ఏఈ రాజు ఉన్నారు.
ఎదురులేని శక్తి టీఆర్ఎస్
రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉన్నదని ఎమ్మెల్యే రవీంద్రకుమార్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేశ్‌చౌదరి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం అందించే పథకాలు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు,సోషల్ మీడియా నాయకులు రమేశ్, జగదీశ్, బొడ్డుపల్లి కృష్ణ, పులిరాజ్, ఇలియాస్ పటేల్, తౌఫిక్ఖాద్రీ, నరేశ్, విష్ణు, మధు, రమేశ్, సురేశ్, వెంకటేశ్ ఉన్నారు.
‘అలింకో’ సేవలు అభినందనీయం
కొండమల్లేపల్లి : దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తున్న అలింకో సంస్థ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఐసీడీఎస్ కొండమల్లేపల్లి ఆధ్వర్యంలో మండలంలోని కొల్‌ముంతలపహాడ్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ యొక్క సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు ఉపకరణాలు, సహాయ పరికరాల అందించేందుకు అలింకో సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామంలో అర్హులైన దివ్యాంగులను గుర్తించేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీడీపీఓలు ఉదయ, లావణ్య, అనురాధ, ఏసీడీపీ సరళ, జడ్పీటీసీ సరస్వతమ్మ, శిరందాసు కృష్ణయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ రవినాయక్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.