నకిరేకల్, జూలై 23 : సీఎం కేసీఆర్ మున్సిపల్ కార్మికుల వేతనాల పెంచడాన్ని హర్షిస్తూ టీఆర్ ఎస్కేవీ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నకిరేకల్ మున్సిపల్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కార్మికుల కష్టా లు సీఎం కేసీఆర్కు తెలుసునని, అందుకే మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచినట్లు తెలిపారు. అనంతరం సంఘం మున్సిపల్ యూనియన్ పట్టణాధ్యక్షుడు వంటెపాక కృష్ణ య్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కమిషనర్ బాలాజీ, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణీకృష్ణమూర్తి, టీఆర్ఎస్కేవీ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిలువేరు ప్రభాకర్, కార్మికులు పాల్గొన్నారు.