వడ్డేపల్లి, ఫిబ్రవరి 13 : జోగుళాంబ గద్వా ల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమ విజయంలో తెలంగాణ జాగృతి ప్రమేయం లేదని ఏఐఎఫ్బీ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మున్సిపాలిటీలో 10 వార్డులకుగాను 8 వార్డులను ఏఐఎఫ్బీ కైవసం చేసుకోవడంపై సంతోషం వ్యక్తంచేశారు. ప్రజాభిప్రాయం మేరకు తాము నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.