నకిరేకల్, జూలై 21 ః పాలపై జీఎస్టీ విధించడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ అన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నకిరేకల్ సెంటర్లో గురువారం పాలక్యాన్లతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, పార్టీ మండలాధ్యక్షుడు పగడపు నవీన్‌రావు, నాయకులు గొర్ల వీరయ్య, కౌన్సిలర్లు పల్లె విజయ్, రాచకొండ సునిల్, చౌగోని సైదులు, చింతా శివమూర్తి, గడ్డం స్వామి, పోతుల రవీందర్, బానోతు వెంకన్న, కందాల భిక్షంరెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సామ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
సామాన్యులపై పెనుభారం
కట్టంగూర్ : కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులపై పెంచిన జీఎస్టీ వల్ల సామాన్యులపై పెనుభారం పడుతుందని జడ్పీటీసీ తరాల బలరాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు అన్నారు. జీఎస్టీకి వ్యతిరేకంగా గురువారం మండల కేంద్రంలో నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, పనస సైదులు, పరుశరాములు, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, మహిళ నాయకురాలు గాజుల బుచ్చమ్మ, నాయకులు చిట్యాల రాజరెడ్డి, వనం దుర్గయ్య, సిరిగిరెడ్డి శేఖర్‌రెడ్డి, బోడ యాదగిరి, నోముల వెంకటేశ్వర్లు, బొల్లెద్దు యాదయ్య, కురిమిల్ల మల్లేశ్, పోతరాజు నగేశ్. జనార్దన్, చౌగోని నాగరాజు, మంగదుడ్ల వెంకన్న, చెరుకు నర్సింహ, కట్ట జానకిరెడ్డి, ఎర్రమాద నర్సిరెడ్డి, వడ్డె సైదిరెడ్డి, కత్తుల దేవేందర్ పాల్గొన్నారు .
జీఎస్టీని ఉపసంహరించుకోవాలి
కేతేపల్లి : మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. జీఎస్టీని ఉపసంహరించుకోవాలని తాసిల్దార్ డి.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిముట వెంకన్నయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, నాయకులు ఆర్.సైదులుగౌడ్, ఎం.విజయరాణి పాల్గొన్నారు.
సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం
చిట్యాల : కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం చిట్యాల పట్టణంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీతావెకటేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆవుల ఐలయ్య, పట్టణాధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, నాయకులు గుండెబోయిన సైదులు, జిట్టా చంద్రకాంత్, బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, మందిరి రమేశ్, జిట్ట బొందయ్య, సిలువేరు శేఖర్, రుద్రవరం యాదయ్య, బొర్రారెడ్డి, దాసరి నర్సింహ, ప్రవీణ్, గండమల్ల శంకర్, నాగరాజు పాల్గొన్నారు.