నల్లగొండ రూరల్, జూలై 10: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధ్దిదారుడికీ అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ రైతు సహాయ మంత్రి కైలాశ్ చౌదరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పై కలెక్టరేట్లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య పాఠశాల స్థాపనకు ప్రతిపాదనలు సమర్పిస్తే మం జూరు చేస్తానన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, డీఆర్ఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని, డీఈఓ భిక్షపతి, డీఏఓ సుచరిత, డీపీఓ వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్చౌదరి నల్లగొండలో ఆదివారం ప్రారంభించారు. స్వా తంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.