Beer | తరచూ బీర్ తాగుతున్నారా..? ఎన్ని అనర్థాలు సంభవిస్తాయో తెలుసా..?
వీకెండ్ వచ్చిందంటే చాలు యువత ఎక్కువగా బీర్ తాగుతూ వీకెండ్ వైబ్స్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బీర్ తాగడం సరదగా ఉన్నప్పటికీ ఇది మన ఆరోగ్యానికి గణనీయమైన హానిని కలిగిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Beer | వీకెండ్ వచ్చిందంటే చాలు యువత ఎక్కువగా బీర్ తాగుతూ వీకెండ్ వైబ్స్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బీర్ తాగడం సరదగా ఉన్నప్పటికీ ఇది మన ఆరోగ్యానికి గణనీయమైన హానిని కలిగిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చాలా మంది బీరే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ బీర్ లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. బీర్ తాగడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఎముకలు బలహీనంగా తయారవుతాయి. 35 సంవత్సరాలు దాటిన తరువాత ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళలు బీర్ తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి. నెలసరి సమస్యలు రావడం, మానసికపరమైన సమస్యలు రావడం జరుగుతుంది. పురుషులు బీర్ తాగడం వల్ల వారిలో ఛాతి పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గి ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా శరీరం శక్తి, పనితీరుతో పాటు ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. బీర్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా తలెత్తుతుంది.
లివర్‌పై తీవ్ర ప్రభావం..
చాలా మంది బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నామని భావిస్తూ ఉంటారు. కానీ బీర్ వల్ల మన ఆరోగ్యానికి కలిగే హాని గురించి ఎవరూ ఆలోచించరు అని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా బీర్ తాగడం వల్ల మూత్రవిసర్జన పెరుగుతుంది. దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. తలతిరగడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బీర్ లో ఉండే ఆల్కహాల్ పేగులో ఉండే పొరలను చికాకుకు గురి చేస్తుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు అధికం అవుతాయి. ఆమ్లత్వం పెరగడంతో పాటు పొట్టలో పుండ్లు కూడా ఏర్పడతాయి. బీర్ ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలం పాటు బీర్ తాగడం వల్ల సిర్రోసిస్, ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ హెపటైటిస్ వంటి కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాలక్రమేణా మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది. అభిజ్ఞా పనితీరు క్షీణించడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
గుండె ఆరోగ్యంపై కూడా..
బీర్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. కనుక బీర్ ను తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. బీర్ తాగే అలవాటును ఒక్కసారిగా మానేయలేని వారు ఈ అలవాటును క్రమంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. బీర్ వంటి ఆల్కహాల్ కలిగిన పానీయాలను ఆరు నెలల పాటు తీసుకోకపోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంలో పెద్ద మార్పులను చూడవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. బీర్ ను మానేయడం వల్ల మనం అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Beer
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

