Romario Sheperd : టీ20 ప్రపంచకప్‌లో బ్యాటర్ల విధ్వంసానికి బ్రేకులు వేస్తూ హ్యాట్రిక్‌తో రికార్డు నెలకొల్పాడు రొమారియో షెపర్డ్ (Romario Sheperd ). మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లోనే అతడు ఈ ఈ సీట్ సాధించాడు. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో స్కాట్లాండ్ బ్యాటర్లను వణికించిన ఈ స్పీడ్‌స్టర్ 17వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా ఈ సీజన్లో ఈ మైలురాయితో మొదటి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ తీసిన పదో బౌలర్‌గా షెపర్డ్ చరిత్ర సృష్టించాడు.
పదో సీజన్ టీ20 ప్రపంచకపలో వెస్టిండీస్ పేసర్ హ్యాట్రిక్‌తో జట్టును గెలిపించాడు. 183 పరుగుల ఛేదనలో తడబడిన స్కాట్లాండ్ను చావు దెబ్బకొడుతూ పేస్ గన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. 17వ ఓవర్ రెండో బంతికి క్రాస్‌ను ఔట్ చేసిన షెపర్డ్ మూడో బంతికి లీస్క్‌ను పెవిలియన్ పంపాడు. హ్యాట్రిక్ బంతికి ఒలివర్ డేవిడ్సన్ క్లీన్‌బౌల్డయ్యాడు. అంతే.. టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ తీసిన పదో బౌలర్‌గా నిలిచాడు షెపర్డ్.
Maiden T20I five-for ✅
Second T20I hat-trick ✅
Winning catch ✅A day to remember for Romario Shepherd 🤩 pic.twitter.com/NfMJhKoncJ
— ESPNcricinfo (@ESPNcricinfo) February 7, 2026
ROMARIO SHEPHERD HAS A T20 WORLD CUP HAT-TRICK! 🔥 pic.twitter.com/edru8MAy3B
— ESPNcricinfo (@ESPNcricinfo) February 7, 2026