నీలగిరి, జూలై 10 : రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి సూచించారు. తన ఛాంబర్లో ఆదివారం మున్సిపల్ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ (9186 82 220100)ను వినియోగించుకోవాలన్నారు. మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సెలవులు లేవని, శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని, నాలాలను శుభ్రం చేయాలని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు.
మురుగుకాల్వలో నీరు నిల్వడం, చెట్లు విరిగి పడడం, శిథిలావస్థ్ధలో ఉన్న గృహాలు, వీధి దీపాలు తదితర సమస్యలకు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో సిబ్బంది పని చేస్తారని ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే సంప్రదించాలన్నారు. సమావేశంలో అదనపు అదనపు కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఏసీపీ నాగిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు ముర్తుజా, సురిగిశంకర్, గడ్డం శ్రీనివాస్, ప్రదీప్‌రెడ్డి ఉన్నారు.
పట్టణంలో పర్యటన..
వర్షాలకు లతీఫ్సాబ్ గుట్ట నుంచి వచ్చే వరద నీరు పట్టణంలోని 48వ వార్డు గుండా ప్రవహిస్తుండడంతో ఆదివారం వార్డులో కమిషనర్ రమణాచారి కౌన్సిలర్ యామ కవితారాణీదయాకర్తో కలిసి పర్యటించారు. పారిశుధ్య పనులను పరిశీలించి డ్రైనేజీ కాల్వలను శుభ్రం చేయాలన్నారు.
ప్రభుత్వ దవాఖానలో అల్పాహారం
ప్రభుత్వ దవాఖానలో ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని కమిషనర్ రమణాచారి ప్రారంభించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, మోహన్‌రావు, శివశంకర్ సింహాద్రి, దాత శోభారఘు, సతీశ్ పాల్గొన్నారు.
శిథిలావస్థ్ధలోని గృహాల తొలగింపు
నీలగిరి: పట్ణణంలోని పానగల్, పాతబస్తీ, గొల్లగూడ, బొట్టుగూడ ప్రాంతాల్లో పలు ఇండ్లను పట్టణ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా ఏసీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ వర్షాలు విపరీతంగా కురుస్తుడడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తుగా జా గ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట టీపీఎస్ శివకుమార్ ఉన్నారు.