చివ్వెంల, జూలై 8 : మండల కేంద్రంలో శుక్రవారం జలశక్తి అభియాన్ కేంద్ర బృందం మినీ గురుకుల పాఠశాలలో ఇంకుడు గుంతలు, మొక్కలను పరిశీలించింది. సూర్యాపేట జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం సభ్యులు సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మండల కేంద్రంలోని నర్సరీ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ డాక్టర్ పెంటయ్య, హెచ్ఆర్ మేనేజర్ పెంటయ్య, ఎంపీడీఓ లక్ష్మీ, ఏపీఓ నాగయ్య, సర్పంచ్ జూలకంటి సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి రజినీ, ఈసీ జ్యోతి, రమాదేవి ఉన్నారు.
మోతె : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర జలశక్తి అభియాన్ బృందం సభ్యుడు కేంద్ర విద్యాశాఖ డైరెక్టర్ మార్చంగ్ వర్తింగ్ అన్నారు. మండలంలోని కూడలి గ్రామంలో పాలేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం, చేపలచెరువు, విభలాపురంలో పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర బృందం సభ్యులు వర్షంలో సైతం తిరిగి అభివృద్ధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీడీ డాక్టర్ పెంటయ్య, ఐబీ ఈఈ భద్రు, డీఈ రమేశ్, ఏఈ లింగయ్య, ఎంపీడీఓ శంకర్‌రెడ్డి, ఎంపీఓ హరిసింగ్, సర్పంచులు నర్సింహారావు, రమేశ్, చిన్నవీరస్వామి, టీఆర్ఎస్ నాయకుడు వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.