నల్లగొండ, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులు భూ సమస్యలకు శాశ్వత పరిష్కార వేదికలుగా నిలవాలని కలెక్టర్ రాహుల్ శర్మ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అన్నారు. ఆర్డీఓ, తాసీల్దార్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయ న మాట్లాడారు. రెవెన్యూ యంత్రాంగానికి పలు సూచనలు చేసి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సదస్సులో వచ్చే ప్రతి దరఖాస్తును స్వీకరించి సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సదస్సుల తర్వాత గ్రీవెన్స్‌కు భూసమస్యల కోసం బాధితులు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో మూడ్రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులు రోజుకు ఎన్ని గ్రామాల్లో నిర్వహించాలి అనేది నిర్ణయించి దీనికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కోసం అవసరమైతే అనుభవం ఉన్నవారిని నియమించుకోని ఏ పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సదస్సులపై ముందుగానే ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించి కేంద్రాల వద్ద ఈ మొబైల్ వాహనం, ఇంటర్నెట్, ఇతర మౌలిక వసతుల కల్పనపై తాసీల్దార్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 31 మండలాల్లో అదనపు కలెక్టర్, ఆర్డీఓలు,స్పెషల్ కలెక్టర్లు వారికి కేటాయించిన మండలాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీఓలు జగదీశ్వర్ రెడ్డి, రోహిత్ సింగ్, శ్రీనివాస్ నాయక్, తాసీల్దార్లు పాల్గొన్నారు.
నల్లగొండ : భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తెలిపారు. సీఎస్ సోమేశ్ కుమార్ గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఆర్డీఓలు, తాసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ సదస్సులకు ప్రతి మండలానికి తాసీల్దార్లతో కూడిన బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్పలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీఓలు, తాసీల్దార్లు పాల్గొన్నారు.