నల్లగొండ, జులై 6: మన ఊరు-మన బడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల ఆన్లైన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాహల్ శర్మ అదేశించారు. కలెక్టరేట్లో ఇంజినీర్లతో బుధవారం సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో ఇంజినీర్ల్లు సంబంధిత మండల అధికారులు, పాఠశాల కమిటీ, ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకోని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆఫ్‌లైన్‌లో ఈజీఎస్ పనులకు అడ్మిషన్ పొందిన తర్వాత ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఒకటి రెండు సార్లు సరిచూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ నరేందర్‌రెడ్డి, పీఆర్ ఈఈ తిరుపతయ్య, విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల సంస్థ ఈఈ అనిత పాల్గొన్నారు.
క్రీడా స్థలాలు త్వరగా గుర్తించాలి
నల్లగొండ : తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలను త్వరితగతిన గుర్తించాలని ఎంపీడీఓలు, ఎంపీఓలను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, ఎంపీఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి మాట్లాడారు. మండలస్థాయిలో కన్వర్జెన్సీ సమా వేశం ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి నివేదిక అందజే యాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ప్రారంబించడానికి గ్రౌండింగ్ పూర్తి చేయాలని, గుర్తించిన స్థలాల్లో అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. హరితహారం పథకం కింద మొక్కలు నాటడానికి గుంతలు తీయాలన్నారు. ఈనెల 12 వరకు 75శాతం మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్ రెడ్డి, డీపీఓ విష్ణువర్దన్‌రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని పాల్గొన్నారు.