వలిగొండ, జూలై 2 : మండలకేంద్రంలోని 5వ వార్డు పల్లె ప్రకృతి వనంలోకి శనివారం సాయంత్రం వచ్చిన నెమలిని కోతులు వెంబడించాయి. ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలో రక్షణ కంచెలో చిక్కుకున్న నెమలిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని నెమలిని రక్షించారు. చౌటుప్పల్ ఆటవీశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.