దేవరకొండ, జూన్ 18 : ఈ నెల 20 వరకు రేషన్ దుకాణాల ద్వారా ఉచిత రేషన్ అందించనున్నట్లు పౌర సరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారి మాచన్ రఘనందన్ తెలిపారు. శనివారం దేవరకొండ గిడ్డంగిలో డీలర్లకు కొత్త ఈ పాస్ యంత్రాలను అందించారు. ఇప్పటి వరకు ఉన్న యంత్రాల ద్వారా సాంకేతిక సమస్య ఎదురవుతుందని చెప్పడం వల్ల కొత్తవి అందిస్తున్నట్లు చెప్పారు. దేవరకొండ పరిధిలో 194 కొత్త మిషన్లు రాగా ఇప్పటి వరకు 145 మంది డీలర్లకు అందిం చినట్లు పేర్కొన్నారు.
డీలర్లకు యంత్రాల అందజేత
చందంపేట : రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు అందించిన కొత్త ఈ-పాస్ మిషన్లను శనివారం మండల కేంద్రంలో డీటీసీఎస్ మాచన రఘునందన్ పంపిణీ చేశారు. రేషన్‌కార్డు దారులకు ఒక్కో యూనిట్‌కు 5 కేజీల చొప్పున ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, కృష్ణయ్య, భాషానాయక్, విష్ణువర్ధన్‌రెడ్డి, పరమేశ్, వెంకటయ్య, లక్ష్మి పాల్గొన్నారు.