నీలగిరి, జూన్ 18 : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు వైకుంఠరథాలను కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ శనివారం ప్రారంభించారు. హిందు, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరుపేదలు చనిపోతే పార్థీవదేహాలను వైకుంఠధామాలకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నందున మున్సిపాలిటీ నుంచి ఈ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు తీగల జాన్‌శాస్త్రీ, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యుశ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీమా చెక్కు అందజేత
తిప్పర్తి : మండలంలోని దుప్పలపల్లి ఎంపీటీసీ దంపతులు దొంతం వేణుగోపాల్ రెడ్డి, కవిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉండడంతో రూ.2లక్షల చొప్పున బీమా చెక్కులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి శనివారం మృతుల కుటుంబసభ్యుకు అందజేశారు.
నల్లగొండ : రాజ్యసభ సభ్యుడు జోగిని సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాష్ట్ర గొర్రెలు, అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ శనివారం జిల్లా కేంద్రంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మొక్క నాటారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, ఏడీలు విశ్వేశ్వర్రావు, ఆర్కే రెడ్డి పాల్గొన్నారు.
చెస్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ
నల్లగొండ రూరల్, జూన్ 18 : ఈ నెల 23న మేకల అభినవ్ జయంతి సందర్భంగా నిర్వహించే చెస్ టోర్నమెంట్ పోస్టర్‌ను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తన క్యాంపు కార్యలయంలో శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేకల అభినవ్ తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, అరుణ, అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ, జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కె.కరుణాకర్‌రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు డైమాండ్ శ్రీనివాస్, మేడం విశ్వప్రసాద్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్, ట్రస్మా జిల్లా గౌరవాధ్యక్షుడు యానాల ప్రభాకర్‌గౌడ్, యోగా గురువు శంకరయ్య పాల్గొన్నారు. పోటీలో పాల్గొనే వారు 995423823 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.