పెద్దఅడిశర్లపల్లి, జూన్ 14 : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు అన్నారు. మంగళవారం మండలంలోని అజ్మాపురం, పడమటి తండాలో నిర్వహించిన పల్లెప్రగతిలో పాల్గొన్నారు. గ్రామంలో నర్సరీని, శిథిలావస్థలో ఉన్న భవనాలను పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మోహన్‌రెడ్డి, సర్పంచ్ ఆదిరాల నాగేశ్, ఏపీఓ శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మర్రిగూడెంలో..
త్రిపురారం : మండలంలోని మర్రిగూడెం గ్రామం లో రోడ్డు వెంట ఉన్న పిచ్చి మొక్కలను, చెత్త కుప్పలను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించారు. నర్సరీని ప్రత్యేకాధికారి రవీందర్ పరిశీలించారు. ఎంపీఓ భిక్షంరాజు, సర్పంచ్ బాల్తి పద్మ, పంచాయతీ కార్యదర్శి అరుణ పాల్గొన్నారు.
పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలి
గుర్రంపోడు : గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలని ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్ సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో శ్రమదానం ద్వారా వీధులను శుభ్రం చేశారు. ఎంపీడీఓ పనులను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.