చందంపేట, జూన్ 11 : పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే సీఎం కేసిఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం చందంపేట మండలంలోని హంక్యతండాలో 25 డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన ప్రారంభించి లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం దేశానికే ఆదర్శమని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు. త్వరలోనే సొంత స్థలం ఉన్న పేదలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, ఉపాధ్యక్షులు ముత్యాల సర్వయ్య, యాసాని రాజవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ రజితారామకృష్ణ, ఏర్పుల గోవిందుయాదవ్, రమావత్ మోహన్‌కృష్ణ, గోసుల అనంతగిని, బొల్లు రామకృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ, వడ్త్య బాలు, శంకర్‌నాయక్, మర్ల శ్రీశైలం, నాగార్జున, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ డీఈలు లింగారెడ్డి, నగేశ్, ఏఈలు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని గాగిళ్లాపురంలో రూ.12.60లక్షలతో నిర్మించిన శ్మశానవాటిక, రూ.5లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు , రూ.4లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ, పల్లె ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.