దామరచర్ల, జూన్ 11 : వృథా జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మండలంలోని వీర్లపాలెం, పుట్టలగడ్డతండా వద్ద అన్నవేరు వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లకు శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. మండలంలోని అన్నవేరు వాగులో నీరు ప్రతి ఏడాది వృథాగా కృష్ణానదిలో కలుస్తుందని, వీటిని వినియోగించుకొని బీడుభూములను సాగులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మండలంలో ఐదు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయడం జరిగిందని, వాటి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అదే విధంగా పుట్టలగడ్డ తండా వద్ద రూ.2.49 కోట్లు, వీర్లపాలెం వద్ద రూ.3.66కోట్ల వ్యయంతో చేపట్టే చెక్‌డ్యామ్‌లతో నీటి నిలువ సామర్థ్యం పెరిగి పరిసర గ్రామాల్లో భూగర్భ జాలలు పెరుగుతాయని తెలిపారు.
పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధిలో దామరచర్ల మండలం దూసుకుపోతుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు వీరకోటిరెడ్డి, జడ్పీటీసీ ఆంగోతు లలిత, అడవిదేవులపల్లి ఎంపీపీ బాలాజీనాయక్, వైస్‌ఎంపీపీ సైదులురెడ్డి, దారగాని వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, బాల సత్యనారాయణ, ఐబీ ఈఈ లక్ష్మణ్, డీఈ జనార్దన్, ఏఈ భిక్షం పాల్గొన్నారు.
కులవృత్తులను ఆదుకున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే..
కులవృత్తులకు అదుకున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. దామరచర్లలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి స్వప్న, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు వీరకోటిరెడ్డి, పశువైద్యశాఖ ఏడీ వెంకటరెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.