బొడ్రాయిబజార్, జూన్ 11 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలోని 42వ వార్డులో రూ.12.30లక్షలు, 45వ వార్డులో రూ.8.90లక్షలు, 11వ వార్డులో 12.80లక్షల రూపాయలతో చేపట్టిన అంతర్గత సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పల్లెలు, పట్టణాలకు భారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లాలో సవాల్‌గా తీసుకున్నారని, నాటిన ప్రతి మొక్కనూ కాపాడేందుకు ప్రజలు కృషి చేయాలని అన్నారు.
సూర్యాపేటను పచ్చని పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు అంగిరేకుల రాజశ్రీనాగార్జున, గండూరి పావనీకృపాకర్, ఎడ్ల గంగాభవానీవీరమల్లు, జ్యోతిశ్రీవిద్య, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు స్వరూప, ఈఈ జీకేడీ ప్రసాద్, డీఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, ఏఈ రాజిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, జిల్లా నాయకులు గండూరి కృపాకర్, అంగిరేకుల నాగార్జున, బత్తుల రమేశ్, సయ్యద్ సలీం, కుక్కడపు సాలయ్య, భిక్షం, రాచూరి రమణ, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.