చిట్యాల, జూన్ 8 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి, బడిబాట కార్యక్రమా లతో పాఠశాలల అభివృద్ధి చెందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం చిట్యాల అంగన్వాడీ కేం ద్రంలో బడిబాట, వెల్మినేడు ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో సీడీపీఓ కవిత, ఏసీ సీడీపీఓ వెంకటమ్మ, వెలిమినేడు సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ, రేణుక, ఆండాలు, పద్మ, కవిత పాల్గొన్నారు.
మనుగోడులో…
మునుగోడు : మండలకేంద్రంలోని కమ్మగూడెంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహారంతో చేకూరే ప్రయోజనాలపై టీచర్ విక్టోరియా ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కేంద్రాలు దోహదపడతాయని చెప్పారు.
దేవరకొండలో…
దేవరకొండ, : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచాలని దేవరకొడ మున్సిపల్ కమి షనర్ వెంకటయ్య అన్నారు. బుధవారం పట్టణం లోని శివాజీనగర్‌లో అంగన్వాడీ కేంద్రంలో బడి బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందించే పోషకాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కౌన్సిలర్ తస్కిన్ సుల్తాన్, వార్డు ప్రత్యేకాధికారి నరేశ్, ముత్యాలు, ఆర్పీ హేమలత, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.
నిడమనూరులో…
నిడమనూరు : రెండేండ్లు దాటిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్ సైదాబేగం, నోడల్ అధికారి నీలిమ పిలుపునిచ్చారు. నిడమనూరు, ముకుందాపురం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో బుధవారం బడి బాట అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఎల్కేజీ వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యాబోధన చేస్తున్నామన్నారు. పిల్లల్లో మేథోశక్తిని పెంపొందించే లక్ష్యంగా ఆటపాటలతో కూడిన విద్యనందిస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో ముకుందాపురం సర్పంచ్ కేశ శంకర్, పంచాయతీ కార్యదర్శి కోటేశ్, అంగన్వాడీ టీచర్లు అంబటి మణెమ్మ, సుగుణ, రాజేశ్వరి, పద్మజ, ఝాన్సీ పాల్గొన్నారు.
హాలియాలో…
హాలియా : అనుముల మండలం పేరూరు గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అన్నప్రాశన, సామూహిక అక్షరాభ్యాసం, బడిబాట కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఉపాధ్యాయు రాలు సాయిశ్రీ,అంగన్వాడీ టీచర్ వనజ,ఏఎన్ ఎం జ్యోతి, ఆశ కార్యకర్త మంగమ్మ పాల్గొన్నారు.