మాల్, జూన్ 8: ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించి కార్పొరేట్‌కు దీటుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రామావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చింతపల్లి మండలంలోని తిదేడు, నసర్లపల్లి, వింజమూరు, గొడకొండ్ల ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గొడకొండ్లలో వైకుంఠధామాన్ని ప్రారంభించి, అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షరభ్యాసం చేయించి, బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఆంగ్ల మాధ్యమంలో బోధిందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలను చిన్నారులు, బాలంతలు, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రవీణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్‌రెడ్డి, మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు నట్వ గిరిధర్, కిష్టారెడ్డి, అశోక్, ఏఈ జీవన్‌సింగ్, సర్పంచులు శ్రీదేవీశ్రీనివాస్, లలితాబాయీ మోహన్, రవీందర్‌గౌడ్, సుమతిరెడ్డి, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవి, నాయకులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.