దేవరకొండ రూరల్, జూన్ 8 : కుల వృత్తిదారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గొర్రెలు, మేకలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృత్తిదారులకు స్వయం ఉపాధి, గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. గొర్రెల పంపిణీ ద్వారా పెంపకందారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని పేర్కొన్నారు. జూలై నుంచి రెండో విడుత గొర్రెలు పంపిణీ చేపట్టను న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి నాగయ్య, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, సర్పంచ్ మేడం సత్తయ్య, ఎంపీటీసీ రమావత్ నర్సింహ, నాయకులు రేపాని ఇద్దయ్య, పల్లెం శ్రీను, తుల్చ్యానాయక్ పాల్గొన్నారు.
జీవాలకు మందు తాపించాలి
మిర్యాలగూడ రూరల్ : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయించాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదయ్యయాదవ్ సూచించారు. బుధవారం మండలంలోని ఆలగడపలో జీవాలకు నట్టల నివారణ మందు తాపించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుంగపహాడ్, దొండవారిగూడెం గ్రామాల్లో సర్పంచులు ప్రారంభించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారులు నాయిని దుర్గారమాదేవి, అనుదీప్, జానీపాషా, కృష్ణనాయక్ పాల్గొన్నారు.
జీవాలను రక్షించుకోవాలి
త్రిపురారం : ప్రభుత్వం జీవాలకు ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని గొర్రెలు, మేకలను రోగాల బారి నుంచి కాపాడుకోవాలని ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పశువైద్యశాల ఆవరణంలో జీవాలకు నట్టల నివారణ మందు తాపించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారతీభాస్కర్నాయక్, పశువైద్యాధికారి శశికళ, ఎంపీటీసీ అంబటి రాము పాల్గొన్నారు.
మునుగోడులో..
మునుగోడు : మండల కేంద్రంలోని పశువైద్యశాల ఆవరణలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న తాపించారు. వైద్యుల సలహా మేరకు జీవాలకు టీకాలు వేయించాలని కోరారు. పశు వైద్యాధికారి వెంకన్న, ఎంపీటీసీ ఈద నిర్మల పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండలంలోని వల్లాల గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాపించే కార్యక్రమాన్ని పశువైద్యాధికారి శరణ్య ప్రారంభించారు. ఈ నెల 18 వరకు అన్ని గ్రామాల్లో నట్టల నివారణ మందు పంపిణీ చేస్తామని, జీవాల పెంపకం దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కట్టంగూర్ : మండలంలోని కల్మెర గ్రామంలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ శిబిరాన్ని సర్పంచ్ పిన్నపురెడ్డి నర్సిరెడ్డి ప్రారంభించారు. సీజనల్ వ్యాధుల పట్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి బిక్యానాయక్, సిబ్బంది సైదమ్మ, చెరుకు శ్రీను పాల్గొన్నారు.
పీఏ పల్లిలో..
పెద్దఅడిశర్లపల్లి : మండల కేంద్రంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ నర్రావుల జయమ్మాలచ్చిరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువైద్యాధికారి మహేందర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.