డిండి, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించి కార్పొరేట్‌కు దీటుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని చెర్కుపల్లి, కొత్తతండా, రహమంతాపూర్, ఎర్రగుంటపల్లి, కందుకూరు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ఎంపీపీ సునీతాజనార్దన్రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనంతరం వావిల్‌కోల్ గ్రామంలో సంజీవనీ చారిటబుల్ట్రస్ట్ ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైడ్ ప్యాంట్, నెమలిపూర్ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దానియేల్, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, వైస్‌చైర్మన్ జంగారెడ్డి, డిండి, దేవరకొండ మండలాల రైతుబంధు సమితీ అధ్యక్షులు వెంకటేశ్వర్రావు, కృష్ణయ్య, వైస్ ఎంపీపీ పుల్లమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రావు, సర్పంచులు నర్సింహారావు, సుధామణీవెంకట్రెడ్డి, పేట రాధావెంకటయ్య, వానం మౌనికానరేందర్రెడ్డి, డి.దామోదర్‌రావు, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు వెంకటయ్య, రజిత, శేఖర్‌రెడ్డి, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, గోపాల్‌రావు, రాఘవాచారి, ప్రశాంత్‌రావు, బుచ్చిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణ, సూరి, జయంత్, సంజీవ, రాంరెడ్డి పాల్గొన్నారు.
కందుకూర్లో బొడ్రాయి ప్రతిష్ఠ
డిండి : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని కందుకూరులో బొడ్రాయి పండుగ కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీతాజనార్దన్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మమ్మ, వైస్‌చైర్మన్ జంగారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రావు, సర్పంచ్ వానం మౌనికానరేందర్రెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, రాఘవాచారి, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రశాంత్‌రావు, విష్ణు, గోపాల్‌రావు, కృష్ణ, సంజీవ, రాంరెడ్డి, దామోదర్‌రెడ్డి, జయంత్ పాల్గొన్నారు.
దేవరకొండరూరల్ : మండలంలోని తూర్పుపల్లిలో సోమవారం నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠోత్సవాల్లో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పాల్గొని పూజలు చేశారు. గ్రామ సర్పంచ్ నిర్మల ఎమ్మెల్యేను సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మమ్మ,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్.కృష్ణయ్య, నాయకులు జెల్లా రేణుగౌడ్, నరేందర్‌రావు, వెంకటేశ్వర్రావు, కృష్ణ, గోపాల్ పాల్గొన్నారు.