న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: వివాహితుడైన ఓ వ్యక్తి ప్రియురాలిని హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. కమలా నగర్లో నివసించే సమీర్‌కు ఏడాది క్రితం మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన సియా(33) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది.ఆమెతో అతను సహ జీవనం చేశాడు. ఈ వ్యవహారంపై సమీర్ భార్య, సియా మధ్య గొడవలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 9న జరిగిన గొడవలో సమీర్ ఆగ్రహంతో సియా గొంతు నొక్కి హత్య చేశాడు.