చందంపేట, జూన్ 6 : హరిత తెలంగాణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటా లని జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రుమంలో భాగంగా సోమవారం మండలంలోని పోలేపల్లి, బిల్డింగ్‌తండా, వెల్మ గూడెం గ్రామాల పరిధిలో పల్లె ప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అధిక నిధులు కేటాయిస్తుందని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. అనంతరం చందంపేట ఎంపీడీఓ కార్యాలయంలో పంచా యతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను చర్చించారు. ఆయన వెంట జడ్పీటీసీ పవిత్ర, ఎంపీడీఓ రాములునాయక్, ఎంపీఓ జానయ్య, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, సర్పంచులు కవిత, సంతోషి, గిరి, శంకర్రావు, రామకృష్ణ, మంగారమేశ్నాయక్, మోహన్, మహేశ్, ఏపీఓ వరలక్ష్మీ, టీఏ జవహ ర్లాల్ పాల్గొన్నారు.
అనుముల మండలంలో…
హాలియా : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తుందని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. అను మల మండలంలోని చింతగూడెం, రామడుగు, పులిమావిడి, శ్రీనాథపురం గ్రామాల్లో సోమవారం పల్లెప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి : ఎమ్మెల్యే నోముల
ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన గుణాత్మక విద్య లభిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమ వారం మండలంలోని పులిమామిడి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇం టింటి ప్రచారం చేశారు. అనంతరం పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్ర మాల్లో ఎడమ కాలువ మాజీ వైస్ చైర్మన్ మలిగి రెడ్డి లింగారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓలు లక్ష్మి, వెంకటేశ్వర్లు, సర్పంచులు వెంకట్రామ్రెడ్డి, మాలే వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కురా కుల వెంకటేశ్వర్లు, ఏఓ సంతోషిని, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నీలిమా మహేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ అశోక్, కోఆప్షన్ సభ్యుడు సైదులు, ప్రధా నోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు , అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
నల్లగొండ పట్టణంలో…
నీలగిరి : పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం నాలుగో రోజు నల్లగొండ 48 వార్డుల్లో కొనసాగింది. ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు కాలనీల్లో తిరిగి సమస్యలను గుర్తించారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి 48వ వార్డులో పర్యటించి ప్లాంటేషన్ చేసిన మొక్కలను పరిశీలించారు. చనిపోయిన మొక్కల స్ధానంలో కొత్తవి నాటాలని సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని వార్డు ఆధికారులకు సూచించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల సమస్యలను పట్టణ ప్రగతిలో గుర్తించారు.
నల్లగొండ రూరల్‌లో…
నల్లగొండ రూరల్ : గ్రామాలను సస్యశ్యామ లం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ వై శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అప్పాజీపేట, బుద్దారం, కంచనపల్లి గ్రామాల్లో శానిటేషన్ పనులను పరిశీలించారు. క్రీడా ప్రాంగణాల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి నర్సింగ్ భట్ల, పాతూరు, చెన్నుగూడెం గ్రామాలలో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.
మునుగోడు మండలంలో…
మునుగోడు : ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ సభల్లో గుర్తించిన పనులను పూర్తిచేయాలని డీఆర్డీఓ కాళిందిని ఆదేశించారు. మండలంలోని జక్కలివారిగూడెంలో పల్లె ప్రగతి పనులను ఆమె సోమవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. వానకాలంలో వ్యాధులు ప్రభలకుండా పిచ్చిమొక్కలు, కంపచెట్లను తొలగించాలన్నారు. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీపీ కర్నాటి స్వామి, ఎంపీడీఓ యాకూబ్‌నాయక్, మండల ప్రత్యేకాధికారి ప్రసాద్, ఎంపీఓ సుమలత, సర్పంచ్ జక్కలి శ్రీను ఉన్నారు.
తిప్పర్తిలో…
తిప్పర్తి : సర్వారం గ్రామాన్ని పారిశుధ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ పుల్లభట్లా ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఐదో విడత పల్లెప్రగతిలో భాగంగా సర్వారంలోని పాఠశాలను, మంచి నీటి ట్యాంకులను శుభ్రపరిచారు. ఈంసదర్బంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శౌకత్ అలీ, జానయ్య, వెంకన్న, సైదులు పాల్గొన్నారు.
నాంపల్లిలో…
నాంపల్లి : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని ఎస్డబ్ల్యూ లింగోటం, వడ్డపల్లి, నాంపల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలలాను సందర్శించి మాట్లాడారు. మండలకేంద్రంలో కంపోస్టు షెడ్లో ఏరువుల తయారీని అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్మాసన వాటిక ఆవరణలో మొక్కలు నాటారు. ప్రాథమికోన్నత పాఠశాలో సిబ్బందిచే పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషుకుమార్, తాసీల్దార్ లాల్బహూదుర్, సర్పంచ్ కుంభం విజయ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కుంభం కృష్ణారెడ్డి, కొండల్, రాజశేఖర్‌రెడ్డి, యాదయ్య, కిరణ్, కొండయ్య, మహత్మ, పంచాయతీ కార్యదర్శి సత్తార్ పాల్గొన్నారు.
దేవరకొండలో…
దేవరకొండ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో పలు వార్డుల్లో సమస్యలను పరిష్కరించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలిపారు. సోమవారం వివిధ వార్డుల్లో గుర్తించిన సమస్యలను ప్రత్యేకాధికారుల ద్వారా పరిష్కరించినట్లు కమిషనర్ తెలిపారు. డ్రైనేజీ పనులు, విద్యుత్ దీపాలు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. ఆయన వెంట వైస్ చైర్మెన్ రహత్‌అలీ, కౌన్సిలర్ తస్కిన్ సుల్తాన్ సిబ్బంది పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్‌లో…
మిర్యాలగూడ రూరల్ : పల్లె ప్రగతి కార్యక్రమా లతో గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయని శ్రీనివా స్‌నగర్ సర్పంచ్ భోగవల్లి వెంకటరమణ చౌదరి అన్నారు. 5వ విడుత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో జేసీబీ సహాయంతో సోమవారం డ్రైనేజీ కాల్వ తీయించారు. గ్రామంలో వంద శాతం పారిశుధ్యం అమలవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి గజ్జల అనితారెడ్డి, గ్రామ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
నందికొండలో…
నందికొండ : మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సాగర్ 7వ వార్డు కౌన్సిలర్ నిమ్మల ఇందిర అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం వార్డులో డ్రైనెజీలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రగతి సమస్యల పరిష్కరానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకుడు నిమ్మల కొండయ్య, వార్డు అధికారి మల్లేశ్ పాల్గొన్నారు.