నార్కట్‌పల్లి ఏప్రిల్ 19 : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ అనారోగ్యంతో సోమవారం మృతి చెందిన విషయం విదితమే. ఆయన పార్థ్ధివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం నార్కట్‌పల్లి పట్టణంలో ఎమ్మెల్యే స్వగృహంలో ఉంచారు. మృతదేహాన్ని మంగళవారం ఉదయం నార్కట్‌పల్లి నుంచి ఎమ్మెల్యే స్వగ్రామం బ్రాహ్మణ వెల్లెంలకు తరలించారు. అంతిమయాత్ర మొదలు కాగానే విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఓదార్చి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలోని ఎమ్మెల్యే చిరుమర్తి వ్యవసాయ క్షేత్రంలో నర్సింహ అంత్యక్రియలు నిర్వహించారు. నర్సింహ పార్థ్ధ్దివ దేహానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ, యదాద్రి జడ్పీ చైర్మ న్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ పుష్ప గుచ్ఛంతో నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ నేతలు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
నివాళులర్పించిన ప్రముఖులు..
ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, పూల రవీందర్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, వంటెద్దు నర్సింహారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు, మదర్ డెయిరీ చైర్మన్ కృష్ణారెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు భిక్షం, టీఆర్ఎస్ నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, నార్కట్‌పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు చిరుమర్తి నర్సింహ భౌతి కకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.