నిడమనూరు, ఏప్రిల్ 19 : ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ఆదేశించారు. ధాన్యం సేకరణపై మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యాన్ని శుభ్రపర్చి తెచ్చేలా ఏఈఓ, ఏపీఎంలు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేయడం, కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ధాన్యం దిగుబడి అంచనా, కొనుగోలు, గన్నీ బ్యాగుల లభ్యతపై చర్చించారు. అనంతరం వల్లభాపురంలో దళితబంధు లబ్ధిదారుల అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. దళితులకు దీర్ఘకాలిక ప్రయోజనమే లక్ష్యంగా దళిత బంధును సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, ప్రావీణ్యం కలిగిన రంగాల్లో ఉపాధి పొందే దిశగా యూనిట్లు ఎంచుకోవాలని సూచించారు.
అనంతరం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. వెంకటాపురంలో సీసీ రోడ్డు పనులు, వైకుంఠధామం, రేగులగడ్డలో సీసీ రోడ్డు పనులను, రైతువేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మేనేజర్ నాగేశ్వర్రావు, ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, తాసీల్దార్లు ప్రమీల, మంగ, పాండునాయక్, ఎంపీడీఓ ప్రమోద్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామర్ల జానయ్య, మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచులు పోలె డేవిడ్, కొమిరె సైదమ్మామహేశ్, జంగిలి రాములు, నన్నెబోయిన రామలింగమ్మారవి, ఎంపీటీసీ పెదమాం యాదయ్య, నన్నెబోయిన సైదమ్మాసత్యనారాయణ, నాయకులు బొల్లం రవియాదవ్, అల్వాల కళావతి, జాల పాపయ్య, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, నల్లబోతు వెంకటేశ్వర్లు, కన్నెబోయిన ఆనంద్, మండలి సునీత, సింగం రామలింగయ్య పాల్గొన్నారు.