నల్లగొండ/ నల్లగొండ రూరల్/ కనగల్/ తిప్పర్తి, ఏప్రిల్ 8 : యాసంగి సీజన్లో రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నల్లగొండ నియోజకవర్గవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎండగడుతూ నినదించారు. నల్లగొండలోని వీటీ కాలనీ నివాసంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని లేదంటే వడ్లు కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నల్లగొండలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్లు ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు.
నల్లగొండ మండలంలో అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, బకరం వెంకన్న, గాదెరాంరెడ్డి, మన్నె కృష్ణార్జున్‌రెడ్డి, రాజుపేట మల్లేశ్‌గౌడ్, చింత సైదులు, నారగోని నర్సింహ, బడుపులశంకర్ , తవిట కృష్ణ, రవీందర్‌రెడ్డి, పెద్ది వెంకటయ్య పాల్గొన్నారు. తిప్పర్తి మండలం మర్రిగూడెంలో జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఇండ్లూరులో ఎంపీపీ విజయలక్ష్మి, తమ ఇండ్లపై నల్ల జెండాలను ఎగురువేశారు. కార్యక్రమాల్లో మర్రిగూడెం సర్పంచ్ సతీశ్, నాయకులు నాగులవంచ లింగారావు, మార్త సైదులు, గురువయ్య, యడవెల్లి సోమయ్య పాల్గొన్నారు. కనగల్ మండలం ఇస్లాంనగర్‌లో ఎంపీపీ కరీంపాషా, కనగల్‌లో జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, తుర్కపల్లిలో వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్ తమ ఇండ్లపై నల్లజెండాలను పట్టుకుని నిరసన తెలిపారు.
నకిరేకల్‌లో..
నార్కట్‌పల్లి/కట్టంగూర్/ చిట్యాల/ కేతేపల్లి/ శాలిగౌరారం : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నల్లా జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. నార్కట్‌పల్లి, చిట్యాల ఆందోళనలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొనగా, నార్కట్‌పల్లిలో తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. చిట్యాల పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని వరి కంకుల మోపును ఎత్తుకొని నిరసన తెలిపారు. అనంతరం ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ రైతుల వడ్లు కొనేదాకా వదిలేది లేదన్నారు. అన్నం పెట్టే రైతులకు ఇబ్బంది పెట్టడం సరికాదంటూ కేంద్రం వైఖరిపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్రం వెంటనే రైతులు పండించిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
చిట్యాలలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, కౌన్సిలర్లు పందిరి గీత, జిట్ట పద్మ, బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, నాయకులు కొలను వెంకటేశ్, సుంకరి యాదగిరి, వనమా వెంకటేశ్వర్లు, కూరెళ్ల లింగస్వామి, గుండెబోయిన సైదులు, సిలువేరు శేఖర్, మెండె సైదులు, జిట్ట చంద్రకాంత్, రంగా వెంకటేశ్వర్లు, గంట శ్రీనివాస్‌రెడ్డి, జిట్ట రమేశ్ పాల్గొన్నారు. నకిరేకల్ పట్టణంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నడికుడి ఉమారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి, టీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేసి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్ యానాల అశోక్‌రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కట్టంగూర్ మండల వ్యాప్తంగా రైతులు, పార్టీ నాయకులు తమ ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేసి మండల కేంద్రంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, నాయకులు కుందారపు వెంకట్‌రెడ్డి, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, బీరెల్లి రాజ్యలక్ష్మీప్రసాద్, అంతటి శ్రీనివాస్, పుట్ట వెంకట్‌రెడ్డి, చౌగోని నాగరాజు, పోగుల నర్సింహ, గాజుల బుచ్చమ్మ, చిట్యాల రాజిరెడ్డి, నకిరేకంటి నర్సింహ, బొల్లెద్దు యాదయ్య, మేకల రమేశ్ పాల్గొన్నారు. కేతేపల్లి మండలంలో ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేసి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమాల్లో మండల స్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు. శాలిగౌరారం మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు, టీఆర్ఎస్ నాయకులు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. ఆకారం, ఊట్కూర్ గ్రామాల్లో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్‌రెడ్డి, గుండా శ్రీనివాస్, గంట శంకర్, గుజిలాల్ శేఖర్‌బాబు, బట్ట వీరబాబు, భీమనబోయిన వీరభద్రయ్య, దుబ్బ వెంకన్న పాల్గొన్నారు.
మునుగోడులో..
మునుగోడు/చండూర్/మర్రిగూడ/నాంపల్లి: మునుగోడులో ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, జిల్లా నాయకులు లాల్‌బహదూర్‌గౌడ్, భవనం శ్రీనివాస్‌రెడ్డి, దాడి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు రావిరాల కుమారస్వామి, ప్రజాప్రతినిధులు ఇండ్లపై నల్ల జెండా ఎగురవేశారు. కొరటికల్‌లో సర్పంచ్ వల్లూరి పద్మ నల్ల జెండాలతో నిరసన తెలపగా బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు బొడ్డుపల్లి అంజయ్య సైతం పాల్గొని ప్రధాని మోదీ సర్కారు మొండి వైఖరిని ఎండగట్టారు. చండూరులో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్ తోకల వెంకన్న నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు.
కార్యక్రమంలో అన్నెపర్తి శేఖర్, కోడి వెంకన్న, కొండ్రెడ్డి యాదయ్య, కోడి గిరిబాబు, ఉజ్జిని అనిల్ రావు, పెద్దగోని వెంకన్న, కురుపాటి సుదర్శన్, బొడ్డుసతీశ్, సరికొండ ము త్యాలు, సంగేపు సువర్ణ, భీమనపల్లి శేఖర్, కట్టా సతీశ్, అబ్బనబోయిన లింగయ్య, కళ్లెం సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మర్రిగూడలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూర శంకర్ యాద వ్, ఉపాధ్యక్షుడు మారగోని రామన్న నల్లజెండాలు ఎగురవేశారు. కార్యక్రమంలో రాపోలు యాదగిరి, పగడాల యాదయ్య, రాంరెడ్డి, కొంపల్లి నాగరాజు, పల్లె యాదగిరి, మెగావత్ లాలూనాయక్, చిలువేరు విష్ణు, వంగూరి గిరి పాల్గొన్నారు. నాంపల్లిలో రైతు బం ధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. ఏడుదొడ్ల ప్రభాకర్‌రెడ్డి, కోన్‌రెడ్డి ఏడుకొండలు, బాల్దురి రాము, యాదయ్య పాల్గొన్నారు.