పెద్దఅడిశర్లపల్లి, మార్చి 17 : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి సూచించారు. గురువారం మండలపరిషత్ కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలను బలోపేతం చేసేందుకు గ్రామస్తులు, దాతలు ముందుకు వచ్చేలా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పోత్సహించాలన్నారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి జగన్నాథరావు, ఎంపీడీఓ మోహన్‌రెడ్డి, ఎంఈఓ రాము పాల్గొన్నారు.
మనఊరు- మనబడిలో భాగస్వాములు కావాలి
మిర్యాలగూడ రూరల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు- మన బడి కార్యక్రంలో ప్రతి ఇంక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మన ఊరు- మన బడి కింద ఎంపికైన 17 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వసతులు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం గడువు లోపు పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఎంపీఓ టి.వీరారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ చెన్ను భరద్వాజ్ పాల్గొన్నారు.