చిట్యాల, మార్చి 17 : శాసనమండలి చైర్మన్‌గా రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కి గురువారం చిట్యాలలో స్థానిక ప్రజాప్రతిని ధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. పాల శీతలీకరణ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, సీఐ శివరామిరెడ్డి, తాసీల్దార్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి గుత్తాకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వనమా వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి, లింగస్వామి, సైదులు, సైదులు, వెంకటేశ్, సత్తయ్య, కృష్ణ, బొందయ్య, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, వి. వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : గుత్తాసుఖేందర్ రెడ్డికి మండలంలోని పలువురు నాయకులు, సర్పంచ్ లు, ప్రఙాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దస్రూనాయక్, వస్కుల కాశయ్య, మాఙీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, మాడ్గుల యాదగిరి, గుడెబోయిన లింగం యాదవ్, గుమ్మడవల్లి ఙనార్దన్, వస్కుల శ్రీనివాస్, బలరాంనాయక్, వెంకట్‌రెడ్డి, సైదిరెడ్డి. వెంకటయ్య పాల్గొన్నారు.
డిండి : శాసనమండలి చైర్మన్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్‌రెడ్డిని నల్లగొండలోని ఆయన నివాసంలో గురువారం డిండి ఎంపీపీ సునీతాజనార్దన్రావు కలిశారు. ఈ సందర్భంగా గుత్తాను పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు.
మిర్యాలగూడ : గుత్తా సుఖేందర్‌రెడ్డిని గురు వారం మిర్యాలగూడ రజక సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. వారిలో ఈశ్వరాచారి, పాతనబోయిన వెంకటయ్య పాల్గొన్నారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డిని గురువారం టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు మట్టపల్లి సైదయ్య యాదవ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల ఆర్గనైజర్ కామిశెట్టి శ్రీనివాస్, పులి జగదీష్, ఆలగడప పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఇంద్రవల్లి నరేందర్, మంద శ్రీను పాల్గొన్నారు.
నిడమనూరు, మార్చి 17 : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని గురువారం హైదరా బాద్‌లో టీఆర్ఎస్ రైతు సంఘం మండల అధ్య క్షుడు బైరెడ్డి సత్యనారాయణరెడ్డి కలిసి శుభాకాం క్షలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు లెంకల యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు.