రామగిరి, మార్చి 13 : తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ ఘనంగా నిర్వహించారు. జాగృతి జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో వీటీ కాలనీలోని పంచముఖ ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సతీమణి రమాదేవి కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో మహిళా కన్వీనర్ ఆడెపు వరలక్ష్మి, కోయగూర పద్మ, నాశబోయిన సునంద, టీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు సింగం లక్ష్మి, జాగృతి జిల్లా కో కన్వీనర్ కొండేటి నివాస్, కటకం వెంకటాచారి, నాగార్జున, నాగెల్లి మధు, తమ్మగోటి వెంకట్, మారుతి ప్రకాశ్, కట్టా రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో..
ప్రభుత్వ బాలికల బీసీ హాస్టల్లో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ఆధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. అదే విధంగా హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటి సంబురాలు చేశారు. కార్యక్రమంలో గణేశ్‌చారి, మహేశ్, శిరీష, సంధ్యారాణి, స్వప్న, అనురాధ, శ్వేత, కవిత పాల్గొన్నారు.
చిట్యాల: టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కూనూరు సంజయ్‌దాస్‌గౌడ్, లక్ష్మీప్రియ దంపతులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిత్య కల్యాణం జరిపించి స్వామి వారికి కోడె దూడను సమర్పించారు.
ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో..
మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్‌తో కలిసి కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో అన్నభీమోజు నాగార్జునాచారి, పొనాటి లక్ష్మీనారాయణ, నల్లగంతుల నాగభూషణం పాల్గొన్నారు.
మోడల్ ఐఐటీ పరీక్ష
మిర్యాలగూడ టౌన్/దామరచర్ల : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని ఎస్పీఆర్ స్కూల్లో దామరచర్లలోని శాంతినికేతన్, మోడల్ పాఠశాలల్లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఐఐటీ మోడల్ పరీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, జడ్పీటీసీ ఆంగోతు లలిత, సంఘం మండలాధ్యక్షుడు దత్తునాయక్, బాల సత్యనారాయణ, వీర సైదులు, బైరం గోపి సుద్దుల సైదులు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : మండల కేంద్రంలో చౌరస్తా వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, ఉప సర్పంచ్ గంధం సురేశ్, ఎంపీటీసీ వస్కుల కాశయ్య, తులసీరాంనాయక్, బొడ్డుపల్లి శంకర్, కొండల్‌యాదవ్ పాల్గొన్నారు.
మాల్ : మండలంలోని వెంకటేశ్వరనగర్‌లో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బాదెపల్లి పులిరాజు గౌడ్, కొండూరి శ్రీను, మల్లోజు జగన్‌చారి, మాస భాస్కర్, నర్సింహ, చేపూరి శ్రీను, మామిడి పరమేశ్‌గౌడ్, జిట్ట జగన్ పాల్గొన్నారు.